మిశ్రమ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు..! 12 d ago
దేశీయ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు అప్రమత్తంగా అడుగులు వేస్తున్నాయి. సెన్సెక్స్ ఫ్లాట్గా ట్రేడవుతుండగా.. నిఫ్టీ 24,600 ఎగువన కదలాడుతుంది. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 8 పాయింట్లు పెరిగి 81,515 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 24,626 వద్ద కొనసాగుతుంది.డాలర్ పై రూపాయి మారకం విలువ 84.78 గా ఉంది.